టీఆర్ఎస్‌తో అమీతుమీ.. తిరిగి కాంగ్రెస్‌లోకి డీఎస్?

05-09-2018 Wed 07:11 | Telangana
  • పార్టీలో తనకు విలువ లేదని గుర్తించిన డీఎస్
  • పార్టీతో అమీతుమీకి సిద్ధం
  • కాంగ్రెస్ లో చేరికకు రంగం సిద్ధం 
టీఆర్ఎస్‌లో చేరి అవమానాల పాలవుతున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ తిరిగి సొంత పార్టీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కాంగ్రెస్‌లో చేరికకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న ఆయన తనను సస్పెండ్ చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. సస్పెండ్ చేయకుంటే కనుక అధిష్ఠానంపై మాటల యుద్ధానికి దిగడం ద్వారా తన పంతాన్ని నెగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు.  

కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఓ వెలుగు వెలిగిన డీఎస్ 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే, డీఎస్ ఇద్దరు కుమారుల్లో ఒకరు బీజేపీలో చేరడం, మరో కుమారుడు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతుండడంతో నెమ్మదిగా విభేదాలు మొదలయ్యాయి. దీనికితోడు డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులు తీర్మానం చేసి ఆ ప్రతిని సీఎం కేసీఆర్‌కు పంపడంతో  అవి మరింత ముదిరాయి.

స్థానిక ప్రజాప్రతినిధులు పంపిన తీర్మానంపై సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం, తనను పిలిచి వివరణ అడగకపోవడంతో డీఎస్ కినుక వహించారు. పార్టీలో తనకు విలువ లేకుండా పోయిందని గుర్తించారు. ఈ క్రమంలో పార్టీతో అమీతుమీకి సిద్ధమయ్యారు. అధిష్ఠానానికి రెండు పేజీల లేఖ రాశారు. తనంతట తానుగా రాజీనామా చేయబోనని, పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ వెల్లడించారు. మరో వారం రోజులు వేచి చూసి అప్పటికీ తనను సస్పెండ్ చేయకపోతే పార్టీ మారాలని డీఎస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కాంగ్రెస్‌లో చేరేందుకు ఆయన అనుచరులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. 
D.SrinivasTRSTelanganaCongressKCRNizamabad District

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more