కేవలం వాళ్ల వల్లే నేను ఈ స్థితిలో ఉన్నా: షారుక్ ఖాన్

  • ముంబయికి వచ్చినప్పుడు నటుడిగా కష్టాలు పడ్డా  
  • ఆ సమయంలో సల్మాన్ ఇంట్లో వాళ్లు అన్నం పెట్టారు
  • సల్మాన్ తండ్రి సలీం ఖాన్ నన్ను ప్రోత్సహించారు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘దస్ కా దమ్’. ఈ షో ఫైనల్స్ కు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా షారుక్ తన గతం గురించి చెప్పిన ఓ విషయం ఆసక్తిదాయకం. తాను తొలిసారి ముంబయికి వచ్చినప్పుడు, నటుడిగా కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో, తనకు సల్మాన్ ఖాన్ ఇంట్లో వాళ్లు భోజనం పెట్టారని షారుక్ గుర్తు చేసుకున్నాడు.

సల్మాన్ తండ్రి సలీం ఖాన్ తనను ఎంతగానో  ప్రోత్సహించారని, కేవలం వాళ్ల వల్లే తాను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానని.. షారుక్ ఖాన్ ని అయ్యానని భావోద్వేగం చెందాడు బాలీవుడ్ బాద్ షా. ఇక, ఈ షోకు తాను ముఖ్యఅతిథిగా హాజరు కావడాన్ని ప్రస్తావిస్తూ, కేవలం, సల్మాన్ ఖాన్ అడిగారు కనుకే ముఖ్యఅతిథిగా వచ్చానని, ఆయన ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళతానని నవ్వుతూ చెప్పాడు.
Go Back to Shorts
Salman Khan
sharukh khan

More Telugu News