చంద్రబాబు బయోపిక్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది!
- విడుదల చేసిన చిత్రయూనిట్
- బాబు బాల్యం నుంచి సీఎం వరకూ
- వచ్చే నెలలో సినిమా రిలీజ్
ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. సినిమా టైటిల్ ను ‘చంద్రోదయం- బయోపిక్ ఆఫ్ లివింగ్ లెజెండ్’గా ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయికి చంద్రబాబు ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే చంద్రోదయం సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది.

ఈ సినిమాలో చంద్రబాబుగా వినోద్ నువ్వుల, ఎన్టీఆర్ గా భాస్కర్ నటిస్తుండగా.. వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ పీఆర్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు.