కేన్సర్ పై ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోంది: సీఎం చంద్రబాబు

31-08-2018 Fri 16:22 | Andhra
  • తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ
  • రతన్ టాటాతో కలిసి భూమి పూజ చేసిన చంద్రబాబు
  • రూ.1000 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం 
కేన్సర్ వ్యాధిపై ప్రభుత్వాలు చేయలేని పనిని టాటా ట్రస్ట్ చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశంసించారు. తిరుపతిలో వెంకటేశ్వర కేన్సర్ వైద్య, విజ్ఞాన సంస్థ నిర్మాణానికి టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటాతో కలిసి చంద్రబాబు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారతదేశంలో చాలా మంది సేవాతత్పరులు ఉన్నప్పటికీ, అందరి కన్నా ముందుండే వ్యక్తి రతన్ టాటా అని, దేశ వ్యాప్తంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంకా తక్కువే అన్నట్టుగా ఆయన ఎంతో ఉదారంగా ముందుకు వెళ్తున్నారని, ఇది చాలా గొప్ప విషయమని అన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కేటాయించిన 25 ఎకరాల స్థలంలో రూ.1000 కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు చెప్పారు. మొత్తం వెయ్యి పడకలకు గాను తొలిదశలో 376 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారని, ఈ ఆసుపత్రి ద్వారా రోగులకు కేన్సర్ చికిత్సతో పాటు దేశంలోని టాటా కేన్సర్ చికిత్స కేంద్రాల పరిధిలో పరిశోధనలు చేపడతారని తెలిపారు. కేన్సర్ చికిత్స కోసం అధునాతన పరికరాలను వినియోగిస్తారని, ఈ ఆసుపత్రి దక్షిణ భారతదేశానికి కేంద్రంగా ఉంటుందని, శ్రీ వేంకటేశ్వరుడి పాదపద్మాల కింద ఈ ఆసుపత్రి రావడం మన అందరి అదృష్టమని, ఇందుకు చొరవ తీసుకున్న టాటా ట్రస్ట్ ను ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాని అన్నారు. కాగా, వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల సమీపంలో ఈ వైద్యశాలను టాటా ట్రస్ట్ నిర్మిస్తోంది.
Chandrababucancertirupathiratan tata

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more