పెద్ద కరెన్సీ నోట్ల రద్దు చారిత్రక వైఫల్యం: ‘కాంగ్రెస్’ నేత తుల‌సిరెడ్డి

31-08-2018 Fri 15:03 | Andhra
  • నోట్ల రద్దు ఒక జాతీయ విపత్తు  
  • నల్ల‌ధ‌నం నిర్మూల‌న కాలేదు
  • తెల్ల‌ధ‌నంగా మారిపోయింది  
  • రెండు వేల నోట్ల రూపంలో దాచుకునేందుకు సులువైంది 
రిజర్వు బ్యాంక్‌ సమర్పించిన 2017-18 వార్షిక నివేదిక ద్వారా పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఒక చారిత్రక వైఫల్యమని, ఒక జాతీయ విపత్తు అని స్పష్టమైందని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్‌.తుల‌సిరెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్ల‌ధ‌నం, నకిలీ కరెన్సీ, అవినీతి, ఉగ్రవాదం, తీవ్రవాదం నిర్మూలన కోసం  రూ.500, రూ.1000 నోట్ల చలామణిని రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్‌ 8న ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన విషయం విదితమే అన్నారు. కానీ అందులో ఒక్క ల‌క్ష్యం కూడా నెరవేరలేదని, నల్ల‌ధ‌నం నిర్మూల‌న కాకపోగా తెల్ల‌ధ‌నంగా మారిపోయిందని, రూ.2000 నోట్ల రూపంలో దాచిపెట్టుకునేందుకు మరింత సులువైందని విమర్శించారు.

నకిలీ కరెన్సీ నిర్మూల‌న కాకపోగా నకిలీ నోట్లు బ్యాంకుల్లోకి, అసలు నోట్లు నకిలీ మనుషుల చేతుల్లోకి వెళ్లాయని, సాక్షాత్తూ పోస్టాఫీసు, బ్యాంకు, రిజర్వుబ్యాంకు అవినీతి కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బంది కేవలం 2016 డిసెంబర్‌ 30వ తేదీ వరకే ఉంటుందని, ఆ తర్వాత అంతా మేలే జరుగుతుందని.. అలా జరగకపోతే ‘నడివీధిలో నన్ను ఉరి తీయండని’, ప్రధానమంత్రి గత ఏడాది నవంబర్‌ 13న గోవాలో ప్రకటించి, ఆరు వందల రోజులైనా ఇబ్బంది తప్పలేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపు 150 మంది మరణించారని, 15 కోట్ల మంది దినసరి వేతన జీవులు రోడ్డున పడ్డారని, అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని తులసిరెడ్డి, జాతీయ స్థూల‌ ఉత్పత్తి వృద్ధిరేటు 2017-18లో 6.7 శాతానికి పడిపోయిందని విమర్శించారు.

బ్యాంకు మీద ప్రజల‌కు నమ్మకం పోయిందని, గతం కంటే ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ పెరిగినప్పటికీ బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు కొరత ఉందని పేర్కొన్నారు. ఒక్క హత్య చేస్తేనే ఉరిశిక్ష గానీ, యావజ్జీవ కారాగారశిక్ష గాని న్యాయస్థానం విధిస్తుందని, మరి 150 మంది మరణానికి కారణమైన ప్రధానమంత్రికి ఏ శిక్ష విధించాలి? అని ప్రశ్నించారు. మేలు జరగకపోతే నడివీధిలో ఉరితీయమని ప్రధానమంత్రే చెప్పారని, ‘ఉరి వద్దు..రాజీనామా చాలు’ అని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని, రాజీనామా చేయకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే మోదీని, బీజేపీని అధికారంలో నుంచి దించుతారని తులసిరెడ్డి హెచ్చ‌రించారు.   
black moneymoditulasi reddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more