జకార్తాలో సర్వర్‌గా మారిన భారత మంత్రి.. అథ్లెట్లకు ఆహారం సరఫరా!
- క్రీడాకారులకు సూప్, టీ అందించిన మంత్రి
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజ్యవర్థన్ ఫొటో
- ఆసియాడ్‌లో 50కి చేరిన పతకాల సంఖ్య
ఈ క్రమంలో వారికి బౌల్స్‌లో సూప్, టీ అందిస్తూ, ఆహార పదార్థాలు తీసుకెళ్తూ బిజీగా కనిపించారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాకు చేరడంతో మంత్రిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ‘దేశం కోసం సర్వర్‌గా మారిన మంత్రి’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఆసియాడ్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు త్రుటిలో స్వర్ణం కోల్పోయి రజతంతో సరిపెట్టుకోగా, 800 మీటర్ల పరుగులో భారత్‌కు స్వర్ణం, రజతం వచ్చాయి. అలాగే, టీటీలో, ఆర్చరీలోనూ భారత్ పతకాలు కొల్లగొట్టింది. దీంతో మంగళవారం నాటికి భారత్ సాధించిన పతకాల సంఖ్య 50కి చేరుకుంది.