అమ్మతో కలిసి పనిచేయాలనుంది .. అందుకే ఈ నిర్ణయం: శ్రుతి హాసన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమ్మతో కలిసి పనిచేయాలనుంది .. అందుకే ఈ నిర్ణయం: శ్రుతి హాసన్

  • అమ్మానాన్నల వారసురాలిగా వచ్చాను 
  • నాపై అంచనాలు వుండాలనుకోను 
  • నాకు నచ్చినట్టుగా చేసుకువెళుతుంటాను
తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో అందాల కథానాయికగా శ్రుతి హాసన్ కి మంచి క్రేజ్ వుంది. ఈ మూడు భాషల్లోను శ్రుతికి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ నిదానంగా తనకి నచ్చిన కథలను మాత్రమే చేసుకుంటూ వెళుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన తల్లితో కలిసి ఒక నిర్మాణ సంస్థను ఆరంభించినట్టు చెప్పింది.

"మా అమ్మా నాన్నలు చాలా చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. వాళ్ల వారసురాలిగా నేను ఈ రంగంలోకి వచ్చాను. వాళ్లు గర్వపడేలా నా కెరియర్ ను మలచుకునే పనిలోనే వున్నాను. ఈ విషయంలో నాపై అంచనాలు వుండాలని నేను అనుకోను .. నాకు తోచినట్టుగా నేను అందుకు సంబంధించిన పనులను చేసుకుంటూ వెళుతుంటాను.

ఇంతవరకూ నేను మా నాన్నకి సంబంధించిన సినిమాలకి పనిచేశాను .. ఆయనతో కలిసి పనిచేసినందుకు ఎంతో గర్వపడుతుంటాను. ఇక అమ్మతోనూ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. అందుకే తనతో కలిసి ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించాను. నిజంగా ఇది నాకెంతో ఆనందాన్ని కలిగించే విషయం" అంటూ చెప్పుకొచ్చింది.       
sruthi hassan

More Telugu News