వచ్చే నెలలో 'అరవింద సమేత' నుంచి ట్రైలర్!
Add ap7am to your home Screen

వచ్చే నెలలో 'అరవింద సమేత' నుంచి ట్రైలర్!

  • త్వరలోనే కొత్త పోస్టర్ రిలీజ్  
  • వినాయక చవితికి సాంగ్ బిట్ 
  • ఆ తరువాత రానున్న ట్రైలర్  
త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. రెండు డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించనుండటంతో, అభిమానులందరిలో ఆసక్తి పెరుగుతూపోతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ దిశగానే పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వచ్చేనెల నుంచి ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. వినాయక చవితికి ముందుగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. వినాయక చవితి పండుగ సందర్భంగా ఒక సాంగ్ బిట్ ను విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నారని అంటున్నారు. సెప్టెంబర్ మూడవ వారంలో ట్రైలర్ ను వదలాలనీ .. దానితోనే మరింతగా అంచనాలు పెంచేయాలని చూస్తున్నారని చెబుతున్నారు. యాక్షన్ .. ఎమోషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాతో ఎన్టీఆర్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.   
ntr
pooja hegde

More Telugu News