హైదరాబాద్ లో సూపర్ మార్కెట్లపై అధికారుల కొరడా.. 23 కేసుల నమోదు!
- తనిఖీలు చేపట్టిన తూనికలు, కొలతల శాఖ
- పాత జీఎస్టీ రేటును వసూలుచేస్తున్న మాల్స్
- కేసు నమోదుచేసిన అధికారులు

వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను కేంద్రం తగ్గించినప్పటికీ చాలాచోట్ల పాత రేట్లనే వసూలు చేయడాన్ని అధికారులు గుర్తించారు. మణికొండ, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, మియాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్ సహా పలు ప్రాంతాల్లో అధికారులు ఈ రోజు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన మాల్స్ పై అధికారులు 23 కేసులు నమోదు చేశారు.