ఈ సవతి తల్లి ప్రేమేంటి?: యూఏఈ ఇస్తుంటే తీసుకోవడానికి బాధేంటి?: అసదుద్దీన్ నిప్పులు
- కేరళకు రూ. 700 కోట్లు ప్రకటించిన యూఏఈ
- దాన్ని స్వీకరించేందుకు ఇండియా సిద్ధంగా లేదని వార్తలు
- మండిపడిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ
కేంద్రం కేరళకు కేవలం రూ. 600 కోట్లను మాత్రమే ప్రకటించడం సిగ్గు చేటని వ్యాఖ్యానించిన ఆయన, యూఏఈ ఇస్తుంటే, తీసుకోవడానికి బాధ ఎందుకని అడిగారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నామమాత్రంగా సాయం చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల విగ్రహాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు, నిరాశ్రయులైన వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం లేదని విమర్శలు గుప్పించారు.