కేజ్రీవాల్ నిండు నూరేళ్లు జీవించాలి: మోదీ
- ఈ రోజు కేజ్రీవాల్ పుట్టినరోజు
- శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేజ్రీ
- కేజ్రీకి గ్రీటింగ్స్ చెప్పిన చంద్రబాబు, మమత, ఒమర్ అబ్దుల్లా, సురేష్ ప్రభు తదితరులు
ఈ రోజుతో కేజ్రీవాల్ 50 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, తేజస్వి యాదవ్, సినీ నటులు విశాల్, రితీశ్ దేశ్ ముఖ్ లతో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.