బ్రాహ్మణికి 9 కోట్లకు పైగా జీతం వస్తోంది.. ఎందుకు బయటపెట్టరు?: భూమన
- జగన్ ను ఎదుర్కోలేకే చంద్రబాబు కుట్రలు
- భారతిని కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు
- చంద్రబాబు అవినీతిపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకమే రాశారు
హెరిటేజ్ సంస్థలో బ్రాహ్మణికి రూ. 9 కోట్లకు పైగా జీతం వస్తుందనే విషయాన్ని చంద్రబాబు ఎందుకు బయటపెట్టడం లేదని భూమన ప్రశ్నించారు. హెరిటేజ్ ఆదాయ వ్యవహారాలపై చంద్రబాబు విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. హెరిటేజ్ అక్రమాలు, లోకేష్ అవినీతిపై భవిష్యత్తు ప్రభుత్వాలు విచారణ చేస్తాయని అన్నారు. చంద్రబాబు అవినీతి గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ పుస్తకమే రాశారని చెప్పారు.