ఏపీలో పవన్ కు ఓటరు కార్డు మంజూరు... ఏలూరు చిరునామా!
- ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకున్న పవన్
- అదే ఇంటి చిరునామాతో ఓటరుగా నమోదు
- ఓటరు కార్డు జారీ చేసిన అధికారులు
కాగా, తన పూర్వీకుల సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి నుంచి తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు పవన్ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఆయన ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకుంటానని చెప్పారు. ఇక్కడే ఓటు హక్కుకు దరఖాస్తు చేయించుకోవాలని ఉందని ఆయన అన్నారు కూడా. పవన్ దరఖాస్తును పరిశీలించిన అధికారులు, ఏలూరులో ఓటరుగా ఆయన్ను గుర్తిస్తూ, ఓటరు కార్డును జారీ చేశారు.