'నా భార్యంటే, నా భార్యంటూ' యువతి కోసం రోడ్డుపై రచ్చ... వీడియో చూడండి!
- కర్ణాటకలో ఘటన
- విడాకులు పొందిన మహిళను చేసుకునేందుకు ఇద్దరి యత్నం
- రోడ్డుపై వాగ్వాదం, పిడిగుద్దులు
చుట్టూ చూస్తున్న వారు వారిని విడిపించే ప్రయత్నం చేయకపోగా, వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వార్తను కన్నడ టీవీ చానళ్లు వైరల్ చేశాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, సదరు మహిళ, తన భర్తకు విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటోందట. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న ఈ ఇద్దరూ ఇలా గొడవకు దిగారట. వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాజీ కుదుర్చుకోకుంటే కేసులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారట.