గాంధీ, నెహ్రూ చిత్రాలతో పేపర్ ప్లేట్లు.. ఉపయోగించాక నలిపి పడేసిన నాయకులు!
- రాజమహేంద్రవరం నగర పాలక మండలి సమావేశంలో ఘటన
- పేపర్ ప్లేట్లపై జాతినేతల చిత్రాలు
- అందులోనే అల్పాహారం అందించడంపై విమర్శలు
వీటిని చూసిన కొందరు నొచ్చుకున్నారు. పేపర్ ప్లేట్లపై మహాత్ముల చిత్రాలు ముద్రించడమే తప్పైతే, వాటిలో అల్పాహారం తీసుకున్న నేతలు వాటిని నలిపి పడేయడం మరో పెద్ద తప్పయింది. చెత్తబుట్టలో మహనీయుల ఫొటోలు చూసిన వారు నొచ్చుకుని వాటిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై అధికారులు, నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శలపై అధికారులు, సమావేశంలో పాల్గొన్న నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.