రాజకీయ నేతలంతా ఏకమై.. చంద్రబాబు అనే చీడపురుగును ఏరిపారేయాలి: మోత్కుపల్లి

  • 35 ఏళ్ల పాటు టీడీపీ కోసం పని చేశా
  • అవమానకరంగా పార్టీ నుంచి వెళ్లగొట్టారు
  • ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
వివిధ పార్టీలకు చెందిన నేతలంతా ఏకమై, చంద్రబాబు అనే చీడ పురుగును ఏరి పారేయాలని టీటీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 35 సంవత్సరాల పాటు పార్టీ కోసం పని చేసిన తనను... అవమానకరంగా, గొంతు పిసికి రోడ్డుపై పడేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. ఏ తప్పూ చేయని తన గొంతు కోసిన చంద్రబాబు దానికి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పారు. చంద్రబాబును ఓడించేందుకు ఏపీకి సంబంధించి జగన్, పవన్, కిరణ్ కుమార్ రెడ్డిలను కూడా కలుస్తానని అన్నారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.

ఏ పార్టీలో చేరాలన్న విషయాన్ని తాను ఇంతవరకు నిర్ణయించుకోలేదని మోత్కుపల్లి చెప్పారు. తన గౌరవాన్ని కాపాడే పార్టీలో చేరుతానని అన్నారు. లేని పక్షంలో తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఆలేరు నుంచి ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని చెప్పారు. తాను ఎన్టీఆర్ శిష్యుడినని, ఒకరి మోచేతి నీళ్లు తాగి బతికే వాడిని కాదని అన్నారు.
Go Back to Shorts
motkupalli
chandrababu
jagan
Pawan Kalyan

More Telugu News