బ్రేకింగ్.. కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఇంట్లోకి దూసుకెళ్లిన దుండగుడు.. కాల్చిచంపిన బలగాలు!
- భద్రతా వలయాన్ని ఛేదించిన నిందితుడు
- ఇంట్లో కారుతో విధ్వంసం
- మట్టుబెట్టిన భద్రతా బలగాలు
ఈ ఘటన జరిగిన సమయంలో ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో లేరు. భటిండి ప్రాంతంలో ఉన్న భద్రతా వలయాన్ని ఛేదించిన నిందితుడు.. కారు సాయంతో ఫరూక్ ఇంట్లోకి ప్రవేశించాడు. అనంతరం కారుతో అక్కడ వస్తువుల్ని ఢీకొట్టడం మొదలుపెట్టాడు.
ఆ తర్వాత లోపలకు దూసుకెళ్లేందుకు యత్నించగా అప్రమత్తమైన భద్రతా బలగాలు దుండగుడ్ని మట్టుబెట్టాయి. కాగా, మృతుడి దగ్గర ఎలాంటి ఆయుధాలు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అడ్డుకునే క్రమంలో ఓ పోలీస్ అధికారి గాయపడినట్లు వెల్లడించారు.