ఎన్టీ రామారావుగారు అలా అనడంతో ధైర్యం వచ్చింది : నటి సుధ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీ రామారావుగారు అలా అనడంతో ధైర్యం వచ్చింది : నటి సుధ

  • ఎన్టీఆర్ పెద్దకూతురిగా చేశాను
  • షూటింగు తొలిరోజున ఆయనను చూశాను
  • ఆయనతో మాట్లాడటానికి భయపడ్డాను  
తెలుగు తెరపై తల్లి పాత్రలు .. అక్క .. వదిన పాత్రలకు సరిగ్గా సరిపోయే ఆర్టిస్టుగా సుధ కనిపిస్తారు. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించిన ఆమె, తాజాగా తెలుగు పాప్యులర్ టీవీతో మాట్లాడుతూ తనకి ఎదురైన కొన్ని అనుభవాలను గురించి ప్రస్తావించారు. "ఎన్టీ రామారావుగారితో కలిసి నటించడాన్ని నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేను. 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో నేను రామారావుగారి పెద్ద కూతురుగా నటించాను. మొదటి రోజున షూటింగు కోసం రామారావుగారు 'నాచారం' స్టూడియోకి వచ్చారు.

'ఈ సినిమాలో మీ పెద్దమ్మాయిగా చేసేది ఈ అమ్మాయే ' అంటూ డైరెక్టర్ గారు నన్ను రామారావుగారికి పరిచయం చేశారు. 'పేరేంటమ్మా' అన్నారాయన. చెప్పడానికి నేను భయపడిపోయాను. అప్పుడాయన దగ్గరికి తీసుకుని .. 'ఎందుకు భయపడతావు .. నువ్వు నా పెద్దమ్మాయివి .. మీ నాన్నగారితో ఎలా వుంటావో .. నాతో అలాగుండాలి' అన్నారు. అంతే ఆయనలా మాట్లాడటంతో భయంపోయి .. మనసు తేలికపడింది. ఎన్టీ రామారావుగారి తరువాత బాలకృష్ణ .. జూనియర్ ఎన్టీఆర్ లతో నటించాను. అలాగే అక్కినేని నాగేశ్వరరావు తరువాత నాగార్జున .. చైతూలతోనూ నటించాను. ఇదంతా నా అదృష్టంగా నేను భావిస్తుంటాను" అని చెప్పుకొచ్చారు.  
  
sudha

More Telugu News