పన్నెండు కేసుల్లో నిందితుడైన వ్యక్తిపై కేంద్రానికి అంత ప్రేమ ఎందుకు?: ఏపీ మంత్రి ఆనందబాబు
Add ap7am to your home Screen

పన్నెండు కేసుల్లో నిందితుడైన వ్యక్తిపై కేంద్రానికి అంత ప్రేమ ఎందుకు?: ఏపీ మంత్రి ఆనందబాబు

  • రాజకీయాల్లో కనీస విలువలు లేకుండాపోయాయి
  • ప్రజాస్వామ్యంపై జగన్, పవన్ మాట్లాడటం ఆశ్చర్యమే 
  • చంద్రబాబు చరిష్మాకు మోదీ భయపడుతున్నారు
కేంద్ర ప్రభుత్వం చేతిలో జగన్, పవన్ కీలుబొమ్మలుగా మారారని పన్నెండు కేసుల్లో నిందితుడైన వ్యక్తిపై కేంద్రానికి అంత ప్రేమ ఎందుకు? అని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో కనీస విలువలు లేకుండాపోయాయని, ప్రజాస్వామ్యంపై జగన్, పవన్ మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడపడమే టీడీపీ సర్కార్ లక్ష్యమని, చంద్రబాబు చరిష్మాకు మోదీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, బీసీలకు ఎలాంటి అన్యాయం జరగదని, జగన్ కొన్ని వర్గాల  మధ్య వివాదాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ మాటమారుస్తున్నారని మండిపడ్డారు.
Jagan
nakka anand babu

More Telugu News