జగన్ అసహనంతో మాట్లాడుతున్నారు: సోమిరెడ్డి

  • కాపు రిజర్వేషన్లకు మద్దతిస్తామన్న జగన్.. ఇప్పుడు చేతులెత్తేశారు
  • పవన్ పై ఆయన మాట్లాడిన తీరు సరిగా లేదు
  • జగన్ కు చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రంపై పోరాడాలి
వైసీపీ అధినేత జగన్ అసహనంతో మాట్లాడుతున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాపు రిజర్వేషన్లు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన మాట్లాడిన తీరు సరిగా లేదని అన్నారు. కాపు రిజర్వేషన్లకు మద్దతిస్తున్నామని అసెంబ్లీలో చెప్పిన జగన్... తమవల్ల కాదంటూ ఇప్పుడు చేతులెత్తేశారని విమర్శించారు.

జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని సవాల్ విసిరారు. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పారు. రాష్ట్ర బంద్ లు చేపట్టడం కూడా సరైంది కాదని... దీని వల్ల ప్రజలు ఇబ్బందికి గురవుతారని అన్నారు. 
Go Back to Shorts
jagan
Pawan Kalyan
somireddy

More Telugu News