ప.గో.జిల్లాలో పవన్ ఫ్లెక్సీల తొలగింపు.. కార్యకర్తల వాగ్వాదం!

  • భీమవరం శివారు చినఅమిరంలో స్వల్ప ఉద్రిక్తత
  • అక్కడ పవన్ పర్యటిస్తున్నప్పుడే ఫ్లెక్సీల తొలగింపు
  • పంచాయతీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన కార్యకర్తలు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శివారు చినఅమిరంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ గ్రామంలో పర్యటిస్తున్న సమయంలోనే ఆయన ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. దీంతో, జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఫ్లెక్సీలు తొలగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కల్పించుకుని ‘జనసేన’ కార్యకర్తలకు సర్దిచెప్పారు. కాగా, పవన్ బస చేసిన ఫంక్షన్ హాల్ వద్దకు ఆయన అభిమానులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. తొక్కిసలాట కారణంగా ఓ అభిమాని గాయపడ్డాడు.
Go Back to Shorts
Pawan Kalyan
bhimavaram

More Telugu News