సామ్రాట్ తో ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చిన తేజస్వి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సామ్రాట్ తో ప్రేమ విషయంపై క్లారిటీ ఇచ్చిన తేజస్వి!

  • సామ్రాట్ మంచి మనిషి 
  • ఆయనను ఎక్కువగా చూపించడం లేదు
  • మా మధ్య ఏమీ లేదు    
'బిగ్ బాస్ హౌస్' లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎక్కువగా సందడి చేసిందెవరయ్యా అంటే ఎవరైనా సరే తేజస్వి పేరే చెబుతారు. అంతగా ఆమె ఆ షోలో హడావిడి చేసింది. అలకలు .. విసుర్లు .. కోపాలు .. ఆటపట్టించడాలు చేస్తూ ఈ షోకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ షోలో సామ్రాట్ .. ఆమె నడచుకున్న తీరు చూసిన వాళ్లు, ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారేమోనని భావించారు. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా 'బిగ్ బాస్ హౌస్' లో నుంచి తేజస్వి ఎలిమినేట్ అయింది.

తాజాగా ఆమె ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ "అందరూ కూడా సామ్రాట్ కు ..నీకు మధ్య ఏముంది? అని అడుగుతున్నారు. మా మధ్య ఏమీ లేదు .. ఆయన ఒక మంచి మనిషి .. అలాగే తనీశ్ కూడా. మంచి మనుషులంతా కలిస్తే ఫ్రెండ్స్ అవుతారు. వాళ్లని ఒక టీమ్ అనొచ్చు .. మరేదైనా అనొచ్చు. షోలో సామ్రాట్ కనిపించడం లేదు .. నన్నే ఎక్కువగా చూపించారు. నేను అరవడం .. తిట్టడం .. నా గురించి వేరేవాళ్లు మాట్లాడుకోవడం చూపించారు. తిరిగి 'బిగ్ బాస్ హౌస్'లోకి వెళ్లాలనుకుంటున్నాను .. అది మీ చేతుల్లోనే వుంది" అని చెప్పుకొచ్చింది.     
samrat
tejaswi

More Telugu News