అడవి పందితో రైతు హోరాహోరీ పోరు.. చివరికి రైతుదే విజయం.. ఆదిలాబాద్‌లో ఘటన
- పొలంలో రైతుపై అడవి పంది దాడి
- ప్రాణాలకు తెగించి పోరాటం
- తీవ్రంగా గాయపడిన రైతు
అయితే, అక్కడే మాటువేసి ఉన్న పంది మరోమారు అతడిపై దాడికి దిగింది. ఇక తప్పించుకునే మార్గం లేదని గ్రహించిన రైతు, తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రాణాలకు తెగించి పోరాడాడు. పందికీ-రైతుకు మధ్య హోరాహోరీ పోరు జరిగింది. చివరికి ఒడుపుగా పందిని కిందికి నెట్టిన రైతు దానిని కదలకుండా గట్టిగా నేలకేసి అదిమిపట్టాడు. దీంతో ఊపిరాడక పంది మరణించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న రైతులు తీవ్రంగా గాయపడిన జైసింగ్‌ను ఆదిలాబాద్ ‘రిమ్స్’కు తరలించారు.