శ్రీరెడ్డి ఆరోపణలపై ఆవేశంతో స్పందించిన కార్తీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీరెడ్డి ఆరోపణలపై ఆవేశంతో స్పందించిన కార్తీ!

  • సాక్ష్యాధారాలు వుంటే పోలీసులను ఆశ్రయించాలి 
  • ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదు 
  • త్వరలోనే 'నడిగర్ సంగం' స్పందిస్తుంది
కొంతకాలంగా క్యాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్ పై విరుచుకుపడుతోన్న శ్రీరెడ్డి, ఒక్కసారిగా కోలీవుడ్ ను టార్గెట్ చేసేసింది. మురుగదాస్ .. లారెన్స్ .. సుందర్.సి .. శ్రీరామ్ (శ్రీకాంత్)పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈ విషయాన్ని గురించే అక్కడ అంతా మాట్లాడుకుంటున్నారు. మీడియా వైపు నుంచి కూడా అక్కడి వాతావరణం వేడెక్కింది.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై 'నడిగర్ సంగం' కోశాధికారిగా కార్తీ స్పందించారు. శ్రీరెడ్డి చేస్తోన్న ఆరోపణల్లో నిజం వుంటే .. అందుకు తగిన సాక్ష్యాధారాలు ఆమె దగ్గర వుంటే పోలీసులను ఆశ్రయించాలని కార్తీ అన్నారు. అలా కాకుండా ఎవరిపై పడితే వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజానిజాలు ఎంతవరకూ అనే విషయాన్ని పక్కన పెట్టేసి, శ్రీరెడ్డి ఆరోపణలను హైలైట్ చేయడం ఎంతవరకూ సమంజసమో మీడియానే ఆలోచించుకోవాలని అన్నారు. త్వరలోనే ఈ విషయంపై 'నడిగర్ సంగం' స్పందిస్తుందని ఆయన చెప్పారు.   
karthi

More Telugu News