తొలి మ్యాచ్ లో తొలి వికెట్ దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్

17-07-2018 Tue 19:08 | Sports
  • భారత్- శ్రీలంక జట్ల (అండర్ -19) మధ్య తొలి టెస్టు
  • కొలంబో వేదికగా మ్యాచ్  
  • శ్రీలంకతో భారత్ కు 2 అనధికార టెస్టులు, 5 వన్డేలు
భారత్ తరపున శ్రీలంక జట్టుతో రెండు అనధికార టెస్టులు, ఐదు వన్డేలు ఆడేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అండర్ -19 జట్టులో మొదటిసారి చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కొలంబో వేదికగా ఈరోజు భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. భారత్ అండర్-19 జట్టుకు అనూజ్ రావత్ నాయకత్వం వహిస్తున్నాడు.

ఈ మ్యాచ్ లో అర్జున్ తొలి వికెట్ దక్కించుకున్నాడు. భారత్ తరపున అర్జున్ తొలి వికెట్ సాధించాడు. అయితే, అనధికార టెస్టులు కనుక ఈ గణాంకాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకోదు. అర్జున్ వేసిన రెండో ఓవర్ (ఇన్నింగ్స్ మూడో ఓవర్) లోని చివరి బంతిని కొట్టిన మిషారా (9) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలిరోజు ఆటలో 32 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక జట్టు మూడు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. 
Indiasrilanka

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more