మంత్రి కేటీఆర్ పై కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

15-07-2018 Sun 15:56 | Telangana
  • కేటీఆర్ ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ బూటకం
  • వచ్చే ఎన్నికల్లో నల్గొండలోని అన్ని స్థానాల్లో గెలుస్తాం
టీఆర్ఎస్ పైన, మంత్రి కేటీఆర్ పైన కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, కేటీఆర్ ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ నల్గొండలోని ప్రాజెక్టులపై లేదని, బీబీనగర్ నిమ్స్ పై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ బూటకమని, కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు కడుతున్నారని, మిషన్ భగీరథ పేరిట వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ స్థానాలను గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటపెడతామని, తనకు ఏ పదవులూ వద్దని, కేసీఆర్ ను గద్దె దించడమే ధ్యేయమని అన్నారు.

మరోనేత జానారెడ్డి మాట్లాడుతూ, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, అవసరమొచ్చినప్పుడు ప్రజలు తమ సత్తా చూపిస్తారని అన్నారు. నల్గొండ జిల్లాలో ఉద్దండులైన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ కు కానుకగా ఇస్తామని అన్నారు.

ఏఐసీసీ నేత సలీమ్ అహ్మద్ మాట్లాడుతూ, నల్గొండలో 12 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు గెలుస్తామని, శక్తి యాప్ ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలను సంఘటితం చేస్తామని అన్నారు. ప్రతి కార్యకర్త శక్తి యాప్ లో చేరాలని సూచించారు. అమలుకు వీలుకాని హామీలిచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసి, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని, మోదీ, కేసీఆర్ రహస్యమిత్రులని ఆరోపించారు.
KTRkcrkomati reddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more