మల్టీప్లెక్స్ లపై బయటి ఫుడ్ దెబ్బ... పడిపోయిన ఐనాక్స్, పీవీఆర్ షేర్లు!
- బయటి నుంచి తమకు నచ్చిన ఫుడ్ తీసుకెళ్లేందుకు ప్రేక్షకులకు అనుమతి
- ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట్ర సర్కారు
- 13.1 శాతం పడిపోయిన పీవీఆర్ ఈక్విటీ విలువ
ముక్తా ఏ2 పేరిట థియేటర్ల చైన్ ను నడుపుతున్న సుభాష్ ఘాయ్ ముక్తా ఆర్ట్స్ విలువ పడిపోయి, ఆపై స్వల్పంగా తేరుకుంది. మల్టీప్లెక్స్ యజమానులు తమ ఇష్టానుసారం ఆహార పదార్థాల ఉత్పత్తుల రేట్లను పెంచేసి, ప్రేక్షకులను దోపిడీ చేస్తున్నాయని పలు ఆరోపణలు రాగా, విచారించి, అవి నిజమేనని తేల్చిన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం జనవరిలో ముంబై నివాసి జైనేంద్ర బాక్సీ, అధిక ధరల విషయాన్ని హైకోర్టుకు తన పిటిషన్ ద్వారా తెలియజేయగా, కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసు విచారణ దశలో ఉండగానే, ప్రభుత్వం బయటి తినుబండారాలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయమై మల్టీ ప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ, తమకు ఇంకా ప్రభుత్వం నుంచి లేదా ఎటువంటి నియంత్రణా సంస్థల నుంచి ఆదేశాలు అందలేదని అంటుండటం గమనార్హం.