ఇండియాలోనే ఆయన బెస్ట్ సీఎం: మధ్యప్రదేశ్ సీఎంపై అమిత్ షా ప్రశంసల జల్లు

15-07-2018 Sun 07:54 | National
  • ఉజ్జయిని నుంచి పార్టీ 51వ ఆశీర్వాద్ యాత్ర
  • ధైర్యం ఉన్న నేత అని కితాబు
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సీఎం అభ్యర్థే కరువయ్యారన్న చౌహాన్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలోనే ఆయన అత్యుత్తమ ముఖ్యమంత్రి అని కితాబిచ్చారు. ఇక మధ్యప్రదేశ్ ఎప్పటికీ వెనుకబడిన రాష్ట్రం కాదని తేల్చి చెప్పారు. ఉజ్జయిని నుంచి పార్టీ 51వ ఆశీర్వాద్ యాత్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న చౌహాన్ తన పనితీరుకు సంబంధించిన రిపోర్టును ప్రజల ముందు ఉంచాలన్న ఆయన ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నట్టు చెప్పారు. ‘‘ఈ విషయం చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. దేశంలోనే ఆయన బెస్ట్ సీఎం’’ అని షా పేర్కొన్నారు.

చౌహాన్ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలంలో తొలి పదేళ్లు యూపీఏ హయాంలో గడిచిపోయాయన్నారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం చౌహాన్‌కు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.3.44 లక్షల కోట్లు కేటాయించినట్టు చెప్పారు. గతంలో కేటాయించిన దానితో పోలిస్తే ఇది రెండింతలన్నారు.

చౌహాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థే కరువయ్యారని ఎద్దేవా చేశారు. వారు ఏ యాత్రలు చేపట్టినా ఫలితం ఉండదని, ఎందుకంటే దానిని నడిపించే నాయకుడు వారికి లేరని విమర్శించారు. కాంగ్రెస్ త్వరలోనే ‘పోల్ ఖోలో యాత్ర’ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుండడంతో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit shahBJPJan Ashirvad YatraShivraj Singh Chouhan

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more