నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
- ప్రస్తుతం రాజ్యసభలో 8 మంది నామినేటెడ్ సభ్యులు
- రాష్ట్రపతికి 12 మందిని నామినేట్ చేసే అధికారం
- పెద్దల సభకు ఆరెస్సెస్ ప్రముఖుడు రాకేష్ సిన్హా
ప్రస్తుతం నామినేట్ అయిన వారిలో రామ్ షకల్ యూపీలోని రాబర్ట్స్ గంజ్ నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. రాకేష్ సిన్హా ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూనే ఇండియా పాలసీ ఫౌండేషన్ ను స్థాపించారు. రఘునాథ్ పాత్ర గత ఆరు దశాబ్దాలుగా భరతనాట్యం, ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు.