పరువు బజారుకీడుస్తున్నాడని.. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Add ap7am to your home Screen

పరువు బజారుకీడుస్తున్నాడని.. కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య!

  • భర్త చేష్టలతో విసిగిపోయిన భార్య 
  • మెడకు తువ్వాలు బిగించి హత్య
  • అంగీకరించిన తల్లీకొడుకులు
మద్యానికి బానిసైన భర్తను కుమారుడితో కలిసి హత్య చేసిందో భార్య. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం, జన్వాడలో జరిగిందీ దారుణం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పరమేశ్వర్ (45), భాగ్యమ్మ (39) భార్యాభర్తలు. వీరికి కొడుకు వెంకటేశ్ (17)తో పాటు ఓ కుమార్తె కూడా ఉంది.

మద్యానికి బానిసైన పరమేశ్వర్ నిత్యం తాగి ఇంటికొచ్చి గొడవ చేసేవాడు. తాగి రావడం.. గొడవ పడడం నిత్యకృత్యంగా మారడంతో భాగ్యమ్మ సహించలేకపోయింది. కుటుంబ పరువును బజారున పెట్టొద్దని పలుమార్లు వేడుకుంది. అయినా భర్తలో మార్పు రాలేదు. గురువారం అర్ధరాత్రి మరోమారు తాగి వచ్చిన పరమేశ్వర్ నానా యాగీ చేశాడు.

దీంతో విసిగిపోయిన భాగ్యమ్మ కొడుకు వెంకటేశ్‌తో కలిసి భర్త మెడకు తువ్వాలు బిగించి గట్టిగా లాగింది. దీంతో ఊపిరాడక పరమేశ్వర్ మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ఏమీ తెలియనట్టుగా భర్త మరణించాడని చెబుతూ ఆమె ఏడవడం మొదలెట్టింది. దీంతో స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు వచ్చి భాగ్యమ్మను విచారించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తామే హత్య చేసినట్టు తల్లీకుమారులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.  

Telangana
Ranga Reddy District
Murder

More Telugu News