పొత్తుల్లేవ్.. తెలంగాణలో పోటీపై స్పష్టత ఇచ్చిన అమిత్ షా
- పొత్తులతోనే రెండు రాష్ట్రాల్లోనూ దెబ్బతిన్నాం
- ఒంటరిగానే ఎదుగుదాం
- తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ ఒంటరి పోరు
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ప్రతీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఓ ఎన్నికల ప్రణాళిక రూపొందించాలని నేతలకు సూచించారు. పొత్తుల కారణంగానే ఏపీ, తెలంగాణలో దెబ్బతిన్నామని, ఇకపై ఒంటరిగా వెళ్లి, సొంతంగా ఎదగాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, మంచి వారు పార్టీలో చేరేలా ప్రోత్సహించాలని నేతలకు సూచించారు.