చెన్నైలో భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. నటి ఫిర్యాదుతో వెలుగులోకి.. ఆల్బమ్ నిండా మహిళా నటుల ఫొటోలే!

14-07-2018 Sat 07:13 | National
  • ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా ఎర
  • ఓ నటితో గడిపేందుకు రూ.40 లక్షలు రేటు ఫిక్స్
  • ఆల్బమ్ లో పలువురు మహిళా నటుల ఫొటోలు, ధరలు
సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్ వేదికగా చెన్నైలో భారీ సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నానగర్‌లో నివసించే తమిళ సినీ నటి జయలక్ష్మి ఫిర్యాదుతో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయింది. రిలేషన్ షిప్ డేటింగ్ సర్వీస్ పేరుతో కొన్ని రోజులుగా రెండు నంబర్ల నుంచి తన వాట్సాప్‌కు అభ్యంతరకరమైన మెసేజ్‌లు వస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డేటింగ్ ఇష్టపడేవారి కోసం ఇది ప్రత్యేకమని, డేటింగ్ చేసేందుకు వీఐపీలు కూడా సిద్ధంగా ఉన్నారని, రూ.30 వేల నుంచి రూ.3 లక్షలు వరకు చెల్లించేందుకు రెడీగా ఉన్నారని మెసేజ్‌లు వస్తున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నటి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వాట్సాప్ సందేశాలు ఎక్కడి నుంచి వస్తున్నదీ గుర్తించారు. విరుగంబాక్కానికి చెందిన మురుగ పెరుమాన్, కవియరసన్‌‌లే వీటిని పంపుతున్నట్టు నిర్ధారించుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. యువకుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లలోని ఫొటోలను, అందులోని వివరాలను చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. అందులో బోలెడంతమంది కోలీవుడ్ మహిళా నటుల ఫొటోలు, వారి ధరలతో సహా ఉన్నాయి.

ఆ ఫొటోల్లో ఉన్న ప్రముఖ యువ నటితో గడిపేందుకు రూ.40 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఓ కస్టమర్‌కు మెసేజ్ పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇలా మొత్తం 70 మంది యువతుల అసభ్య ఫొటోలు, వారి రేట్లతో సహా ఉన్నట్టు పేర్కొన్నారు. వాట్సాప్ చాటింగ్‌లను సేకరించిన పోలీసులు.. ఫొటోలు, రేట్లు ఉన్న ఫొటో ఆల్బమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎవరైనా పెద్దల హస్తం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ChennaiS*x RacketCinemaActress

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more