యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తాడిపత్రి ఘటన: టీడీపీ ఎంపీ జేసీ

  • సంబంధిత అధికారిని డిస్మిస్ చేయమని యాజమాన్యానికి చెప్పా
  • మృతుల కుటుంబాలకు నష్టపరిహారం విషయమై మాట్లాడా
  • తగిన విధంగా నష్టపరిహారం చెల్లించకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో గ్యాస్‌ లీకై ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే. ఈ సంఘటనపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని అన్నారు. సంబంధిత అధికారిని వెంటనే డిస్మిస్ చేయాలని యాజమాన్యానికి స్పష్టంగా చెప్పానని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించే విషయమై కూడా తాను మాట్లాడానని, మృతుల కుటుంబాలకు తగిన విధంగా నష్టపరిహారం చెల్లించకపోతే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అవసరమైతే తానే రంగంలోకి దిగాల్సి వస్తుందని యాజమాన్యానికి చెప్పానని అన్నారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని జేసీ కోరారు.
  
Go Back to Shorts
jc diwakar reddy
tadipatri

More Telugu News