చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారు: కృష్ణంరాజు ప్రశంస

  • జగన్, పవన్ లకు బీజేపీ స్క్రిప్ట్ ఇస్తోందనే వార్తల్లో నిజం లేదు
  • ఉత్తరాంధ్రలో బీజేపీపై వ్యతిరేకత లేదు
  • రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతాం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేత, సినీ నటుడు  కృష్ణంరాజు ఎట్టకేలకు ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కష్టపడుతున్నారని కితాబిచ్చారు. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లకు బీజేపీ స్క్రిప్ట్ ఇస్తోందనే వార్తలను ఆయన ఖండించారు. అవన్నీ తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీజేపీపై ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న కృష్ణంరాజు... తాజాగా చంద్రబాబును ప్రశంసించడం గమనార్హం. 
Go Back to Shorts
Chandrababu
krishnamraju
Jagan
Pawan Kalyan
bjp

More Telugu News