పెళ్లి బంధంతో ఒకటైన దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లు కాప్, వాన్!
Add ap7am to your home Screen

పెళ్లి బంధంతో ఒకటైన దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్లు కాప్, వాన్!

  • తాము స్వలింగ సంపర్కులమని ప్రకటించుకున్న క్రికెటర్లు
  • పెళ్లి చేసుకున్న మరిజాన్ కాప్, వాన్ నికెర్క్
  • వివాహం చేసుకున్న రెండో క్రికెట్ జంట
తాము స్వలింగ సంపర్కులమని ధైర్యంగా చెప్పుకున్న దక్షిణాఫ్రికా మహిళా జట్టు క్రికెటర్లు మరిజాన్ కాప్, వాన్ నికెర్క్ లు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మహిళల పెళ్లికి ఎలాంటి అభ్యంతరాలూ లేని దక్షిణాఫ్రికాలో, వీరిద్దరూ వివాహబంధంతో ఒకటయ్యారు. 2009 వరల్డ్ కప్ టోర్నీ నుంచి జట్టులో ఆడుతున్న నికెర్క్, 2017-18 సంవత్సరానికి అత్యుత్తమ క్రికెటర్ గా నిలవడంతో పాటు, దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్ గానూ నిలిచింది.

ఇక కాప్, ఐసీసీ టాప్-10లో కొనసాగుతోంది. వీరిద్దరూ గతంలో దక్షిణాఫ్రికా బాలుర అకాడమీలో శిక్షణ పొందిన అమ్మాయిలుగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకోవడం ఇదే తొలిసారేమీ కాదు. 2017లో న్యూజిలాండ్ కు చెందిన క్రికెటర్లు అమీ సాటర్ వైట్, లియా తహుహులు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
South Africa
Cricket
Marriage

More Telugu News