లోకేశ్ ఢిల్లీకి సైకిల్ పై వెళ్లి నిరసన తెలపాలి: పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

లోకేశ్ ఢిల్లీకి సైకిల్ పై వెళ్లి నిరసన తెలపాలి: పవన్ కల్యాణ్

  • ఉత్తరాంధ్ర సమస్యలు తెలుసుకునేందుకు లోకేశ్ సైకిల్ యాత్ర చేయాలి
  • విశాఖకు రైల్వేజోన్ కావాలంటే నలుగురు చాలు 
  • విశాఖలో బహిరంగసభలో జనసేన అధినేత
ఉత్తరాంధ్ర సమస్యలు తెలుసుకునేందుకు మంత్రి లోకేశ్ సైకిల్ యాత్ర చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. విశాఖపట్టణంలో నిర్వహించిన బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ, ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ లోకేశ్ ఢిల్లీకి సైకిల్ పై వెళ్లి నిరసన తెలపాలని అన్నారు.

‘విశాఖపట్టణానికి రైల్వేజోన్ కావాలంటే నలుగురు చాలు. చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్ కలిసి పోరాడితే రైల్వేజోన్ తప్పక వస్తుంది’ అని పవన్ అన్నారు. గురువు, దైవం లాంటి తన అన్నయ్యను కాదని నాడు టీడీపీకి మద్దతు ఇచ్చానని, ప్రచారం చేశానని, కానీ, ఈరోజు ఉత్తరాంధ్రను అడ్డగోలుగా దోచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్లు పోగొట్టుకోవడానికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, తనకు ఒంటిపై బట్టలు తప్ప వేరే ఏమీ లేవని అన్నారు.
Pawan Kalyan
lokesh

More Telugu News