'ది జియో గిగా ఫైబర్'... ముఖేష్ అంబానీ న్యూ ఎనౌన్స్ మెంట్!

  • దేశవ్యాప్తంగా విస్తరిస్తాం
  • ప్రతి ఇల్లూ స్మార్ట్ గా మారుతుంది
  • ఏజీఎంలో ముఖేష్ అంబానీ
ఫైబర్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్ ను 'ది జియో గిగా ఫైబర్' పేరిట దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ షేర్ హోల్డర్ల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. జియో గిగా ఫైబర్ అందుబాటులోకి వస్తే, అల్ట్రా హై డెఫినిషన్, మల్టీ పార్టీ వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలను ఇంటి వద్ద పొందవచ్చని తెలిపారు. తన యజమాని ఇచ్చే ప్రతి కమాండ్ ను అర్థం చేసుకునేలా వాయిస్ యాక్టివేటెడ్ వర్చ్యువల్ అసిస్టెన్స్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

డిజిటల్ షాపింగ్ దగ్గరవుతుందని, ప్రతి ఇల్లూ స్మార్ట్ హోమ్ గా మారుతుందని, సీసీ కెమెరాల నుంచి, గృహోపకరణాల వరకూ చూపుడు వేలు, నోటి మాట ద్వారా నియంత్రణలో ఉంటాయని అన్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మరే దేశంలో ఉన్నా, తన స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటిని నియంత్రణలో ఉంచుకోవచ్చని ముఖేష్ తెలిపారు. జియో ఫోన్, జియో గిగా ఫైబర్ గురించి తన కుమార్తె ఈషా, కుమారుడు ఆకాష్ వెల్లడిస్తారని చెప్పి, తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
Reliance
Jio Giga Fiber
Mukesh Ambabi

More Telugu News