తెలంగాణ అటవీశాఖ పోలీసులకు సరికొత్త బైక్‌లు
Add ap7am to your home Screen

తెలంగాణ అటవీశాఖ పోలీసులకు సరికొత్త బైక్‌లు

  • మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు బైకులు
  • 36 మందికి అందజేత
  • కార్పొరేషన్ పరిధిలో ఉన్న అటవీ భూములను రక్షించేందుకు చర్యలు
క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తమ సిబ్బందికి తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ సరికొత్త  టూ వీలర్లను అందించింది. కార్పొరేషన్ పరిధిలో ఉన్న అటవీ భూములను రక్షించేందుకు, నిత్య పర్యవేక్షణతో పాటు అటవీ అభివృద్ధి సంస్థ చేపట్టిన ప్లాంటేషన్ పనులను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి ఈ వాహనాలు సమకూర్చినట్లు ఆ కార్పొరేషన్‌ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తెలిపారు. డిప్యూటీ, అసిస్టెంట్ ప్లాంటేషన్ మేనేజర్లు గా పనిచేస్తున్న 36 మందికి ఈ టూ వీలర్లను అందించారు. ఈ సిబ్బంది రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నారు.                                                                    
Telangana
forest
Police

More Telugu News