కేటీఆర్‌... నీ ఇంటికొస్తా.. ఖబడ్దార్‌: వీహెచ్ హెచ్చరిక
Add ap7am to your home Screen

కేటీఆర్‌... నీ ఇంటికొస్తా.. ఖబడ్దార్‌: వీహెచ్ హెచ్చరిక

  • సోనియా గాంధీపై కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు
  • మండిపడ్డ వీహెచ్‌
  • మరోసారి నోరు జారితే సంగతి చూస్తానన్న కాంగ్రెస్‌ నేత
యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీపై మరోసారి నోరు జారితే తాను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సంగతి చూస్తానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు హెచ్చరించారు. 'తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అమ్మా కాదు, బొమ్మా కాదు' అని కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన వీహెచ్‌ తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... తాను కేటీఆర్‌ ఇంటికే వెళతానని, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమని, ఖబడ్దార్ అని అన్నారు. కేసీఆర్ తన కుమారుడి నోటిని అదుపులో పెట్టాలని ఆయన సూచించారు.      
VH
KTR
Telangana

More Telugu News