రాష్ట్రాన్ని లూటీ చేసింది ఎవరో తెలుసుకో: కన్నా లక్ష్మీనారాయణకు కాల్వ శ్రీనివాసులు కౌంటర్
Add ap7am to your home Screen

రాష్ట్రాన్ని లూటీ చేసింది ఎవరో తెలుసుకో: కన్నా లక్ష్మీనారాయణకు కాల్వ శ్రీనివాసులు కౌంటర్

  • అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి
  • గత ప్రభుత్వ క్యాబినెట్‌లో అవినీతి మంత్రుల్లో కన్నా ఒకరు
  • అనేక రాజకీయ కుట్రల్లో కన్నాకు భాగస్వామ్యం ఉంది
టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష పార్టీల నేతలు ఓర్వలేకపోతున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ, వైసీపీ, జనసేనలు తమ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వ క్యాబినెట్‌లో ఐదుగురు అవినీతి మంత్రుల్లో కన్నా లక్ష్మీ నారాయణ ఒకరని అన్నారు.

అనేక రాజకీయ కుట్రల్లో కన్నాకు భాగస్వామ్యం ఉందని, విశాఖపట్నంలో రాంకీ ఫార్మాసిటీకి రిజిస్ట్రేషన్‌ రాయితీలు కల్పించలేదా? అని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. ప్రభుత్వంపై జరుగుతోన్న కుట్రలో భాగంగానే ఆయన బీజేపీ అధ్యక్షుడయ్యాడని ఆరోపించారు. పరోక్షంగా వైసీపీకి సహకరించడానికే కన్నాను బీజేపీ అధ్యక్షుడిగా నియమించారని అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసింది ఎవరో తెలుసుకోమని కన్నా లక్ష్మీనారాయణకు కాల్వ సూచించారు. 
kalva
Telangana
kanna

More Telugu News