జేసీ మాటలను ఎవరూ పట్టించుకోవద్దు: మంత్రి ఆదినారాయణరెడ్డి

  • దీక్షలతో ఉక్కూ రాదు..తుక్కూ రాదన్న జేసీ వ్యాఖ్యలపై స్పందన
  • నిరాశపరిచేలా మాట్లాడటం తగదు
  • రాష్ట్రం పట్ల కేంద్రం ఇప్పటికీ వ్యతిరేకంగానే ఉంది
‘దీక్షలతో ఉక్కూ రాదు..తుక్కూ రాదు’ అంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన దీక్షపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. ఇప్పటికే రాష్ట్రం పట్ల కేంద్రం వ్యతిరేకంగా ఉందని, ఇలాంటి సందర్భాల్లో మరింత నిరాశపరిచేలా జేసీ మాట్లాడటం తగదని హితవు పలికారు. జేసీ వ్యాఖ్యలు సమంజసం కాదని, ఈ మాటలను ఎవరూ పట్టించుకోవద్దని, రాష్ట్రం పట్ల కేంద్రం ఇప్పటికీ వ్యతిరేకంగానే ఉందని అన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకూ తమ పోరాటం ఆగదని, కడప పౌరుషమేంటో చూపిస్తామని అన్నారు.
Go Back to Shorts
jc
adi narayana reddy

More Telugu News