చంద్రబాబు సంపాదించినదంతా విదేశాల్లో దాస్తున్నారు: మోత్కుపల్లి

14-06-2018 Thu 19:27 | Both States
  • చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలి
  • కచ్చితంగా ఎంత సంపాదించారో బయటకొస్తుంది
  • రాజ్యసభ సీట్లను అమ్ముకుంటావా?
చంద్రబాబు నాయుడు సంపాదించినదంతా విదేశాల్లో దాస్తున్నారంటూ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘చంద్రబాబునాయుడు సంపాదించినదంతా దుబాయ్, సింగపూర్, అమెరికాలో దాస్తున్నారు. చంద్రబాబునాయుడు సంపాదించిన ఆస్తులపై సీబీఐ విచారణ చేయాలి. ఒకవేళ దొరికినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవచ్చు. నీకు దమ్మూధైర్యం ఉంటే.. ఆ స్టేలన్నింటినీ వెకేట్ చేయించుకో.

నువ్వు(చంద్రబాబు) ఓపెన్ గా ముందుకు రావాలి. చంద్రబాబుపై సీబీఐ ఎంక్వయిరీ కనుక జరిపితే కచ్చితంగా ఎంత సంపాదించారో బయటకొస్తుంది. రాజ్యసభ సీట్లను అమ్ముకుంటావా? రాజ్యసభ సీటు ఇస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? ఈ సీటును టీజీ వెంకటేష్ కు వంద కోట్లకు నువ్వు అమ్ముకోలేదూ? సీఎం రమేష్ దగ్గర నువ్వు తీసుకున్నావా? లేదా? గరికపాటి మోహన్ రావుకు నువ్వు డబ్బులు తీసుకోకుండా ఇచ్చావా? నేను వాళ్లను తప్పుబట్టడం లేదు. నువ్వు వేలం వేశావు.. వాళ్లు కొన్నారు. వేలం వేస్తామని బోర్డు పెడితే కొనుక్కోకుండా ఎవరుంటారు? తప్పెవరిది.. లీడర్ ది. రాజ్యసభలో ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు ఉండకూడదా?’ అని మోత్కుపల్లి ప్రశ్నల వర్షం కురిపించారు.
Chandrababumothkpalli

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more