తూచ్... బిల్లు అంత లేదు... రూ. 134 మాత్రమే!: తప్పు సరిదిద్దుకున్న తెలంగాణ విద్యుత్ అధికారులు
Add ap7am to your home Screen

తూచ్... బిల్లు అంత లేదు... రూ. 134 మాత్రమే!: తప్పు సరిదిద్దుకున్న తెలంగాణ విద్యుత్ అధికారులు

  • రూ. 3.81 లక్షల బిల్లు వేసిన సిబ్బంది
  • విమర్శలు రావడంతో స్పందించిన అధికారులు
  • కొత్త బిల్లు జారీ
హైదరాబాద్ బోడుప్పల్ లో నివాసం ఉండే స్వరూప అనే మహిళకు రూ. 3.81 లక్షలకు పైగా కరెంట్ బిల్ జారీ కావడంపై విమర్శలు రావడంతో, తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తప్పును సరిదిద్దుకున్నారు. ఆమె ఇంటికి మరోసారి వెళ్లి మీటర్ రీడింగ్ ను చూసిన అధికారులు, ఆమె ఇంట 63 యూనిట్ల విద్యుత్ ను మాత్రమే వాడారని చెబుతూ, రూ. 134 చెల్లించాలని కొత్త బిల్లును జారీ చేయడంతో ఆ ఇంటి వారు ఊపిరి పీల్చుకున్నారు. వాడిన యూనిట్ల వివరాలను మెషీన్ లో నమోదు చేస్తున్న వేళ జరిగిన పొరపాటు కారణంగానే ఇంత బిల్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు. బోడుప్పల్ ఏఏవో, ఈఆర్ఓ, ఏఈ తదితరులు ఈ ఘటనపై స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారని ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
Telangana
Current Bill
Hyderabad

More Telugu News