గోదారమ్మకు వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు!
- పశ్చిమ గోదావరిలో ముగిసిన జగన్ పర్యటన
- నేటి నుంచి తూర్పు గోదావరి జిల్లాలోకి
- గోష్పాద క్షేత్రంలో ప్రత్యేక పూజలు
జగన్ కు సంప్రదాయ స్వాగతం పలికిన గోష్పాద క్షేత్రం వేద పండితులు, వేద మంత్రాలు చదువుతుండగా, నదీమతల్లికి జగన్ హారతినిచ్చారు. ఆపై ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. జగన్ తో పాటు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, జిల్లా నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.