మొదలైన బిగ్‌బాస్ 2.. హౌస్‌లోకి వెళ్లింది వీరే!
- ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన బిగ్‌బాస్-2
- వీడిపోయిన సస్పెన్స్
- హౌస్‌లోకి 13 మంది సెలబ్రిటీలు, ముగ్గురు సామాన్యులు
హౌస్‌లోకి వెళ్లిన మొదటి సెలబ్రిటీ నేపథ్య గాయని గీతామాధురి కాగా, తర్వాత వరుసగా అమిత్ తివారీ, న్యూస్ ప్రెజెంటర్ దీప్తి, ప్రముఖ హేతువాది బాబు గోగినేని, నటుడు తనీష్, నటి భానుశ్రీ, రోల్ రిదా, యాంకర్ శ్యామల, కిరిటి దామరాజు, ఇన్‌స్టాగ్రామ్ క్వీన్ దీప్తి సునయన, కౌశల్, తేజస్వీ, సామ్రాట్ రెడ్డి, గణేశ్, సంజన అన్నె (మోడల్), నూతన్ నాయుడు ఉన్నారు. ఆదివారం సెలబ్రిటీల పరిచయంతోనే సరిపోయింది, ఇక నుంచి రోజూ హౌస్‌లో సందడే సందడి!