నాగశౌర్య సరసన ఇద్దరు కొత్త కథానాయికలు

09-06-2018 Sat 12:59 | Entertainment
  • నాగశౌర్య హీరోగా 'నర్తనశాల'
  • దర్శకుడిగా శ్రీనివాస చక్రవర్తి 
  • 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి  
'ఛలో' సినిమాతో నాగశౌర్య హీరోగానూ .. నిర్మాతగాను సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత సినిమా 'నర్తనశాల'ను కూడా ఆయన సొంత బ్యానర్ పైనే చేస్తున్నాడు. కామెడీతో కూడిన ఈ  ప్రేమకథా చిత్రానికి శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా 60 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా ద్వారా కాశ్మీర పరదేశి .. యామిని భాస్కర్ కథానాయికలుగా తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. కన్నడలో మంచి క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందనను 'ఛలో' సినిమా ద్వారా పరిచయం చేసిన నాగశౌర్య, 'నర్తనశాల' ద్వారా ఈ ఇద్దరు కథానాయికలను పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా తమకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఈ ఇద్దరు హీరోయిన్స్ వున్నారు. ఇక నాగశౌర్య కూడా ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో చేరిపోవడం ఖాయమనే ధీమాతో వున్నాడు. వీళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.    
nagashouryakasmira paradesiyamini

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more