ప్రభుత్వం మాకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు: ఆర్టీసీ సమ్మెపై టీఎంయూ అధ్యక్షుడు
- లాభనష్టాలతో సంబంధం లేకుండా ఆలోచించాలి
- ఎన్నో సంస్థలు నష్టాలతో నడుస్తాయి
- కానీ, ప్రభుత్వం కనీస బాధ్యత వహించాలి
ఇతర యూనియన్ల నాయకులు మాట్లాడుతూ... ఈనెల 11న జరిగే సమ్మెను వాయిదా వేయలేదని, రేపు మధ్యాహ్నం యూనియన్ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికల పేరుతో తమ సమస్యను పక్కదారి పట్టించకూడని వ్యాఖ్యానించారు. తమ సమస్యలకు పరిష్కారం చూపమని కోరితే, చర్చలను కూడా వాయిదా వేస్తూ తరువాత మాట్లాడుకుందామంటున్నారని అన్నారు.