కొత్తగా 20 వేల ఉద్యోగ ఆఫర్లు అందించిన టీసీఎస్
- వివరాలు తెలిపిన టీసీఎస్ గ్లోబల్ హ్యుమన్ రిసోర్సస్ చీఫ్
- నాన్-ప్రెషర్లకు కూడా మరో 4,000 జాబ్ ఆఫర్లు
- 2015లో 40 వేల ఆఫర్ లెటర్లు
- ఈ ఏడాది 35,000
ఐటీ రంగంలో ఓ వైపు నియామకాలు తగ్గిపోతోంటే మరోవైపు టీసీఎస్‌లో మాత్రం నియామకాలు ఆగడం లేదు. 2015లో కంపెనీ 40 వేల ఆఫర్ లెటర్లను అందించగా, ఈ ఏడాది మొత్తం 35 వేలు అందించింది. ఈ ఆఫర్లు అందుకున్న వారిలో 70 శాతం మంది తమ సంస్థలో చేరతారని టీసీఎస్ భావిస్తోంది. గత కొన్నేళ్లుగా టీసీఎస్ రీస్కిల్లింగ్ ప్రొగ్రామ్స్ కూడా చేపడుతోంది.