'కాలా' రిలీజ్ రోజున సెలవు ప్రకటించిన ఓ ఐటీ కంపెనీ!

  • పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా'
  • రేపే భారీ స్థాయిలో రిలీజ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి 
రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'కాలా' సినిమా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రేపు అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు చాలామంది ఆ రోజున సెలవు పెట్టయినా 'కాలా' సినిమా చూడాలని ఫిక్స్ అయ్యారు. ఉద్యోగులందరి దృష్టి 'కాలా' సినిమాపై ఉందని గ్రహించిన కేరళలోని 'టెలిసియస్ టెక్నాలజీ' అనే ఒక ఐటీ సంస్థ .. రేపు సెలవును ప్రకటించింది.

ఉద్యోగుల ఆనందానికి అడ్డుపడటం మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందట. తమ సంస్థ ఆ రోజుని సెలవుదినంగా ప్రకటించిన మాట నిజమేనని అందులో పనిచేస్తోన్న వారు అన్నారు. తమ సంస్థ పబ్లిసిటీ కోసం ఇలా చేయలేదనీ, రజనీ సినిమా పట్ల ఉద్యోగుల్లో గల ఉత్సాహాన్ని గుర్తించే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఇక రజనీ అభిమానులంతా కూడా ఈ సినిమా సృష్టించబోయే రికార్డుల గురించే చర్చించుకుంటున్నారు.  
Go Back to Shorts
rajanikanth
huma

More Telugu News