ఎల్లుండి నుంచి వర్షాలే.. 5,6 తేదీల్లో తెలంగాణలోకి ‘నైరుతి’ ప్రవేశం!
Add ap7am to your home Screen

ఎల్లుండి నుంచి వర్షాలే.. 5,6 తేదీల్లో తెలంగాణలోకి ‘నైరుతి’ ప్రవేశం!

  • ఇప్పటికే చల్లబడిన రాష్ట్రం
  • మరో రెండు రోజుల్లో నైరుతి రాక
  • ప్రస్తుత వర్షాలకు క్యుములోనింబస్ మేఘాలే కారణం
తెలంగాణలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవనాలు రాకముందు కురిసేవని, ఈ నెల 5,6 తేదీల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రెయిన్‌గేజ్ స్టేషన్లలో 60 శాతం వర్షపాతం నమోదు కావడం, 2.5 మిల్లీమీటర్లకు మించి వర్షం కురవడం, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో రుతుపవనాలు వస్తున్నట్టుగా గుర్తించామని వాతావరణ కేంద్రం డైరెక్టర్  వైకే రెడ్డి తెలిపారు.

 పైన చెప్పిన ప్రమాణాలతోపాటు, రేడియేషన్ తగ్గినప్పుడు రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నిర్ణీత సమయానికి ముందే రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయని పేర్కొన్న వైకే రెడ్డి, అవి ఇంకా సాధారణంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితి తెలంగాణపై ఉండబోదన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు క్యుములోనింబస్ మేఘాలే కారణమన్నారు. రుతుపవనాలకు ముందు తేమ గాలులు వీస్తుండడం వల్ల ఈ మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయని వివరించారు.
Rain
Telangana
Hyderabad

More Telugu News